Take a fresh look at your lifestyle.

పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ నెల 22న
2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా నర్మెట్ట గ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, ఆయిల్ ఫామ్ రిఫైనరీ శిలాఫలక ఆవిష్కరిస్తారన్నారు. రైతులు వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో సాంకేతిక చర్చలు జరిపి, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందారు. అదేవిధంగా, ఉత్తమ రైతుల అనుభవాలను తెలుసుకొని తమ వ్యవసాయంలో అమలు చేయదగిన పద్ధతులను గ్రహించినట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.