Take a fresh look at your lifestyle.

పేద వర్గాల పార్టీ సిపిఐ ని కాపాడుకుందాం- సిపిఐ రాష్ట్ర నాయకుడు వియస్. బోస్

 

ముద్ర కాప్రా:

పేద వర్గాల పార్టీ సిపిఐ ని కాపాడుకుందామని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి సిపిఐ కార్యక్రమం సందర్భంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్. మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలతో కూడిన సాధించిన విజయాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా నేడు పేదరికం, నిరుద్యోగం, పాలకులు వీటిని పరిష్కరించకపోగా భావోద్వేగ రాజకీయాలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని, అసలైన సమస్యల నుంచి దారి మళ్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి ,ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.