Take a fresh look at your lifestyle.

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్

 

ముద్ర : మల్కాజిగిరి

భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి లో మెగా మెడికల్ క్యాంప్ సోమవారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ వద్ద సన్ డెంటల్ కేర్ , రేనోవా హాస్పిటల్స్ సౌజన్యంతో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ , మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సన్ డెంటల్ కేర్ ఆసుపత్రిలో స్వదేశీ సాంకేతికతతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ‘స్కాన్ ఓ’ డెంటల్ మెషిన్‌ను వారు ప్రారంభించారు.
ఈ నూతన యంత్రం ద్వారా పళ్ళు, చిగుళ్ల సమస్యలను ఖచ్చితంగా గుర్తించడంతో పాటు తగిన చికిత్సను సూచించే సామర్థ్యం ఉందని నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో సుమారు 400 మందికి ఉచితంగా డెంటల్ స్క్రీనింగ్ , ఫుల్ బాడీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రామచంద్రరావు, ఈటెల రాజేందర్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వైద్య పరికరాలను ప్రజలు ప్రోత్సహించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రధానమంత్రి సూచించిన ‘స్వస్థ భారత్’ లక్ష్యానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు, ఆర్‌కే శ్రీనివాస్, ప్రభు గుప్తా, బాలింగం, గోపు రమణా రెడ్డి, లీలావతి, వేణుగోపాల్ యాదవ్ తదితరులు, పెద్ద సంఖ్యలో స్థానిక కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.