Take a fresh look at your lifestyle.

స్వగ్రామం చేరుకున్న మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ….

తిరిగి వస్తానని కళలో కూడా అనుకోలేదు

ఘన స్వాగతం పలికిన బంధువులు, చిన్ననాటి మిత్రులు….

కోరుట్ల, ముద్ర;
మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి తీపి తిరుపతి బుధవారం రోజు సాయంత్రం జగిత్యాల జిల్లా కోర్టులోని ఆయన స్వగృహానికి చేరుకున్నాడు. బంధువులు చిన్ననాటి మిత్రులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం శాలువాతో సత్కరించారు. బంధువులను కలిసిన తిరుపతి భావోద్వేగానికి లోనయ్యాడు. 1983లో ఉద్యమంలో చేరి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నాలుగు దశాబ్దాల కాలం తర్వాత సొంత గ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. సహచర నేతలతో కలిసి కొద్ది రోజుల క్రితం లొంగిపోయాడు. 43 ఏళ్ల తర్వాత కోరుట్ల కు వచ్చిన ఆయనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘన స్వాగతం పలికారు. చిన్ననాటి రోజులను దేవ్ జీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మొదటిసారిగా సొంత ఇంటికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఉద్యమ బాటలో వెళ్లి తిరిగి సొంతింటికి వస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నాడు. ఇకపై ప్రజా జీవితంలో ఉంటానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.