Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి దుద్దిళ్ళ శ్రీపాదరావు :జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి దుద్దిళ్ళ శ్రీపాదరావు అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరం లో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసo నిరంతరం పోరాడుతూ శాసనసభ్యులుగా, శాసనసభ స్పీకర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి,జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీనాభివృద్ది అధికారి నాగిరెడ్డి, ఏ. ఓ అంజిరెడ్డి, కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.