- మిస్సింగ్ కేసుగా నమోదు
ముద్ర,వీపనగండ్ల : మహాశివరాత్రికి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా గ్రామంలోని కొందరు వ్యక్తులు వెళుతుండగా తాను ఓ యువకుడు వారి వెంట వెళ్లి కొంత దూరం వెళ్లి తాను గ్రామానికి వెళ్ళిపోతానంటూ ఇంటికి చేరకుండా అదృశ్యమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది.స్థానిక ఎస్ఐ కె రాణి కథన ప్రకారం మండల కేంద్రమైన వీపనగండ్ల గ్రామానికి చెందిన బండారు స్వాములయ్య పెద్దకొడుకు బండారు వీరస్వామి(35) ఈనెల 23వ తేదీన గ్రామంలోని కొందరు వ్యక్తులు సందర్భంగా శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరి వెళుతుండగా తాను కూడా శ్రీశైలంకి పాదయాత్రగా వస్తానంటూ వారితో బయలుదేరినట్లు తెలిపారు.కొంత దూరం వెళ్లిన తర్వాత తాను శ్రీశైలానికి రానని గ్రామానికి తిరిగి వెళ్తానని వారితో చెప్పినట్లు తండ్రి స్వాములయ్య ఫిర్యాదుల పేర్కొన్నారు.మూడు రోజులైనా కొడుకు వీరస్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో తెలిసిన చోట వెతికిన సమాచారం లేకపోవడంతో తండ్రి స్వాములయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్ ఐ కే రాణి తెలిపారు.