Take a fresh look at your lifestyle.

వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన బాలుడికి అండగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలుడిని ఎంపీ స్వయంగా పరామర్శించారు.
కంటికి సంబంధించిన ప్రాథమిక చికిత్స పూర్తయిన నేపథ్యంలో, ఎంపీ ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో, బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు.
చిన్నారి ప్రియాంష్‌కు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా సాధ్యమైనంత మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్, ఎయిమ్స్ అధికారులను ఎంపీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.