Take a fresh look at your lifestyle.

కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు.

ముద్ర, మోత్కూర్:
ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వల్ప జ్వరము,దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి చికిత్స అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విద్యార్థినిలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ఉండాలని మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు.కార్యక్రమంలో వైద్యులు నవీన్ సింగ్, గాంధీ, మాధవి, కేజీబీవీ ప్రత్యేక అధికారిని యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.