ముద్ర, తెలంగాణ బ్యూరో :
రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖాధికారులు… శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని తెలిపారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లా్ల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.