ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర కాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారిగా ధర్మపురి నియోజక వర్గానికి వస్తున్న సందర్భంగా నియోజకవరంలోని ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్డు వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ధర్మారం, పెగడపెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కార్యర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

