Take a fresh look at your lifestyle.

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం… రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయమని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన ఆయన మహిళల విద్యకు ప్రాధాన్యతనిస్తూ తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి శ్రమించి, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రస్తుత ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహనీయుల జయంతుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.


అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలు, దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, సామాజిక న్యాయం రంగాల్లో ఫూలే గారి ఆశయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా విద్యా రంగంలో, మహిళాభివృద్ధి కొరకు అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. జిల్లాకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రెసిడెన్సియల్ పాఠశాల అడ్మిషన్స్ కొరకు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నా అవకాశం కలిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ప్రతి ఒక్కరూ మహాత్మా ఫూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతి బా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్. లత, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి జి. సునీత, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఏ.వో కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.