చెంచుల కోసం ప్రత్యేకంగా మోడల్ కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన సదస్సు
తాండూరు, ముద్ర :
తాండూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రతి చెంచు కుటుంబానికి అన్ని వసతులతో కూడిన పక్కా ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో పెద్దేముల్ మండలంలోని చైతన్య నగర్‌లో మంజూరైన 163 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు, సూచనలు, సలహాలు స్వయంగా తెలుసుకుని, ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ ప్రజల సమిష్టి అభిప్రాయం మేరకు మెడల్ కాలనీ ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై సానుకూలంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. చైతన్య నగర్‌లోని ప్రతి అర్హత గల ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించేల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి చెంచు కుటుంబం సురక్షితమైన, సౌకర్యవంతమైన సొంతింటిళ కల సాకారం అయ్యేట్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరమ్మ శ్రీనివాస్, మర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకలు లొంక నర్సింలు, మైపాల్ రెడ్డి, శోభారాణీ, ఎల్లారెడ్డి పలు గ్రామల సర్పంచ్ లు, నాయకులు ఉన్నారు..