Take a fresh look at your lifestyle.

అంజన్నను దర్శించుకున్న జూనియర్ సివిల్ జడ్జి

మల్యాల, ముద్ర: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి పి. రామ్మోహన్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోత్చరణలతో ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.