ముద్ర ప్రతినిధి, ఖమ్మం: గుర్తింపుపొందిన ఇండియస్ రైల్వేస్, భారత్ గౌరప్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైల్ యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి ప్రారంభమవుతుందని , పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ & టూర్ టైమ్స్ డైరెక్టర్ జీ.విఘ్నేష్ తెలిపారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు . ఈ యాత్ర పదిహేను రోజులు జరగనుందన్నారు. ఇండియన్ రైల్వేస్ , భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు , సౌత్ స్టార్ రైలు , భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ‘టూర్ టైమ్స్’ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ద పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్ రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేయనున్నామని చెప్పారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకు విశేష స్పందన లభించిందన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు , పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు. ఇవి మానవ శరీరంలోని వివిధ శక్తి కేంద్రాలను సూచిస్తాయని చెప్పారు. అవి.. అయోధ్య (మనస్సు), మధుర (హృదయం), కాళీ (సహస్రార చక్రం), ఉజ్జయిని (నాభి), ద్వారకా (పాదాలు), గయ (పితృ మోక్ష స్థలం), మాతృ గయ (మాతృ మోక్ష స్థలం) అన్నారు. ఈ ప్రత్యేక టూరిస్ట్ రైలు యాత్రికులకు పలు అనుభవాలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.ఈ రైలులో లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు.లగేజ్ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. థర్డ్ ఏసీ (కంపర్ట్) రూ.45,750, సెకండ్ ఏసీ (డీలక్స్) రూ.54,100, ఫస్ట్ ఏసీ (లగ్జరీ) రూ.69,500 అన్నారు.ఈ యాత్ర టికెట్లను పోన్ 93550 21516 కాల్ చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ బుకింగ్ కోసం www.tourtimes.in సందర్శించవచ్చన్నారు. ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేశ్ పాల్గొన్నారు. ఆసక్తి గల వారు టికెట్స్ బుక్ చేసుకోండి మరింత సమాచారం కోసం ఈ క్రింది నెంబర్లు సంప్రదించవలసిందిగా 9848343882 , 6303093338 కోరారు.