Take a fresh look at your lifestyle.

డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత

  • ప్రతి స్కూల్ బస్సులోను తప్పని సరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.
  • పాఠశాలల,కళాశాల బస్ ల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.
  • పెద్దపల్లి డీసీపీ కరుణాకర్.

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు,బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని అడ్డగుంటపల్లి లోని ఆద్య బంకెట్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమం కి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై పలు ఆదేశాలు,సూచనలు చేశారు.స్కూల్,యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని,పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు.బస్సు డ్రైవర్లు మద్యం సేవించి,సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్,ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు.స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు.పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను పాటించాలి, విద్యార్థులను ఎక్కించేటప్పుడు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బస్సును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద,ప్రధాన కూడల్లా వద్ద వేగాన్ని నియంత్రించండి.బస్సును ప్రతిరోజూ తనిఖీ చేయండి.టైర్లు,బ్రేక్లు ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించండి.ఏవైనా సమస్యలు ఉంటే,వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోండి.విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించండి.బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పండి.
విద్యార్థులు మీ బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు మీరు బాధ్యత వహించాలి అనే విషయం గుర్తుంచుకోండి. మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచండి.బస్సులో అగ్నిమాపక యంత్రం ఉందని ఉంచుకోవాలి.డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి.సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించండి.విద్యార్థులతో ఓపిక, సహనం గా ఉంటూ మంచి ప్రవర్తన తో ఉండండి.పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే,దానిని పరిష్కరించడానికి,యాజమాన్యంతల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించండి.మీకు అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోండి.బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు ఎప్పటికప్పుడు గుర్తు చేయండి,అవగాహన కల్పించండి.ఈ సూచనలను అనుసరించడం ద్వారా పాఠశాల బస్సును సురక్షితంగానడపగలరు విద్యార్థుల రక్షణ, భద్రత సురక్షితంగా ఉంటుంది.స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్,భూమేష్ అనూష,ఎన్ టి పి సి ఎస్ ఐ ఉదయ్ కిరణ్ రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గా ఎస్సై వెంకటేష్ కమాన్పూర్ ఎస్సై ప్రసాద్ రామగిరి ఎస్సై శ్రీనివాస్,మంథని ఎస్ఐ రమేష్ ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్ ,డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.