- బిఆర్ఎస్ యువజన విభాగం ధర్మపురి నియోజకవర్గపు మాజీ అధ్యక్షుడు అల్లె వెంకటేష్ యాదవ్.
వెల్గటూర్, ముద్ర : బీసీలకు అమలు చేయాలనుకుంటున్న రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని “బిఆర్ఎస్ యువజన” విభాగం ధర్మపురి నియోజకవర్గపు మాజీ అధ్యక్షుడు అల్లె వెంకటేష్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం అయన ఫోన్ లో మాట్లాడారు.ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతూ, కాలయాపన చేసి, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. పారదర్శకత లేకుండా లోప భూయిష్టంగా కులగణన చేయించి, హడావిడిగా అసెంబ్లీలో “బీసీ”బిల్లు ప్రవేశపెట్టి, కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించిందని అన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసి, దానిని తీసుకువచ్చి మరోసారి బీసీలను ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి “బీసీ”లపై చిత్తశుద్ధి ఉంటే ఇతర రాజకీయ పార్టీలపై నెపం పెట్టకుండా, బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి, చట్టబద్ధత కల్పించి, స్పష్టత వచ్చాకనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.