Take a fresh look at your lifestyle.

నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యం: పీయేసీ ఛైర్మన్

శేరిలింగంపల్లి, ముద్ర:

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా చేయడమే తన ప్రధాన లక్ష్యమని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. మసీద్ బండ కె.ఎం.ఆర్. ఎస్టేట్ కాలనీలో రూ.62.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డైనేజీ పనులకు మాజీ కార్పోరేటర్ రాగం నాగేందర్ త్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ప్రత్యేక చొరవ తో నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, జిఎం కృష్ణ, డిజిఎం శ్రీహరి, మేనేజర్ సందీప్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొడిచెర్ల రాములు, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, పవన్, సాయి మరియు కేఎంఆర్ ఎస్టేట్స్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బాబిరెడ్డి, సెక్రటరీ వేణుబాబు, గనస్యం నాగేశ్వరరావు, శ్రీహర్ష, రవికుమార్, పర్వతాలు, సుకుమార్, శ్రీనివాసరావు, గౌతమ్ శ్యామ్, ప్రమోద్, ప్రవీణ్, సుకుమార్, సత్య, అలేఖ్య, అనూష, మౌనిక, లక్ష్మి, ప్రియాంక, మల్లేష్, పవన్, సాయి మరియు కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.