- సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి.
జగిత్యాల టౌన్ : వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్ పరిధిలోని 4,8,10,13,30 వార్డుల్లో డ్రైనేజిలు శుభ్రం చేసి,చెత్త, చేదారం తొలగించడమే కాకుండా ఇళ్లల్లో నీటి నిలువలు ఉండకుండదని ప్రజలకు సూచించారు. నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా మున్సిపల్ సిబ్బంది ఆయిల్ బాల్స్ వేసి మందు పిచికారీ చేశారనీ తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ,శ్రీకాంత్ జవాన్లు పాల్గొన్నారు.
