కుట్రదారులకు చెంపదెబ్బ కోట్టే విధంగా తీర్పు ఇచ్చిన న్యాయ స్థానం.
-మీ.గుంజపడుగు హరిప్రసాద్
జిల్లా అధ్యక్షులు
తెలంగాణ జాగృతి.
కరీంనగర్.
ఈరోజు కరీంనగర్ లో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణి చేసి సంబరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కవితక్క మీద పెట్టిన తప్పుడు కేసును పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేయడం చాలా సంతోషకరం. కవితక్క పై పెట్టిన ఢిల్లీ లిక్కర్ కేసు అనేది తప్పుడు కేసు అని రౌస్ ఎవెన్యూ కోర్టు తేల్చి చెప్పి కేసులు కొట్టివేయడం సంతోషకరమైన విషయం సిపిఐ పెట్టిన లిక్కర్ లో కేసులో స్కాం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని వారు అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే ఇలాంటి తప్పుడు కేసులకు పాల్పడిందని ఈ కేసులో కవిత అక్క తో పాటు కేజ్రీవాల్ మనీష్ సిసోసిడా అందరికీ క్లీన్ చీట్ వచ్చిందని అన్నారు. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది సత్యం నిలబడుతుంది చెప్పడానికి ఈ తీర్పే నిదర్శనం. తెలంగాణ ఆడబిడ్డపై అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి న్యాయ స్థానంలో చెప్ప దెబ్బ లాంటి తీర్పు వచ్చిందని తెలంగాణ ప్రజలు రాబోయే ఈ కలలో అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని ఓటుతో బుద్ధి చెబుతారని వారు అన్నారు. రాజకీయంగా సహాకరించాని వారిపైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోకపోతే ప్రజలే బిజెపి పార్టీకి బుద్ది చెబుతారని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివరాణి, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, జిల్లా సీనియర్ నాయకులు వారల శ్రీనివాస్, రంగరవేణి లక్ష్మణ్, పిన్నింటి సంగీత రెడ్డి, యండి సల్మ, పూదరి రజేశ్వరి గౌడ్, కుర్ర పోచాయ్య, గాలిపల్లి రాత్కకర్ చారి, యండి హుసైన్ జంగ అపర్ణ, బండ అశోక్, సంతోష్ యాదవ్, కుర్ర కౌసిక్, బసవేణి రాజేందర్, కొత్తురి రఘు, గుండెటి తిరుపతి పుసాల పవన్, MD రజీ తదితరులు పాల్గొన్నారు