Take a fresh look at your lifestyle.

కోఆప్షన్ కోసం ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపాలిటీలోని కోఆప్షన్ సభ్యుల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. రాగి వనజ అశోక్, కొరివి రాములు, తాహెర్ అలీ తమ నామినేషన్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, మాజీ చైర్మన్ చంద్రపాల్, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్ మన్సూర్, నాయకులు బొజ్జ పవన్, భూపతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.