Take a fresh look at your lifestyle.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం- సమావేశంలో మంత్రి పొంగులేటి

మున్సిపాలిటీలలో 80% సీట్లు గెలుస్తున్నాం
-గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది
* ఇప్పటికీ ఫోన్ టాపింగ్ జరుగుతుంది
* బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం
* ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
– ఏప్రిల్ నుండి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు
– అసభ్యకర భాష మార్చుకోవాలి
– సమావేశంలో మంత్రి పొంగులేటి

ముద్ర ప్రతినిధి,ఖమ్మం
రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో 80 శాతం సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బుధవారం జరుగుతున్న 116 మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్ లలో 80% పైగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. గత రెండు సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ, గ్రామీణ పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని , పథకాల అందుకున్న పేద కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని పేర్కొన్నారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు పేదలకు అందజేసినట్లు, రెండో విడత ఏప్రిల్ నుండి అందజేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని పేదలకు ఆశలు కల్పించి చెక్కబొమ్మలు ఇల్లు కూడా సక్రమంగా పేదలకు అందజేయలేదని ఆరోపించారు. ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి గృహ నిర్మాణం చేపట్టిందని, ఇళ్ల స్థలాలు లేని పేదవారికి జి ప్లస్ త్రీ ఇల్లు కట్టి పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను, 8.18 లక్షల కోట్ల రుణ తెలంగాణగా గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు అసలు,వడ్డీ కలిపి ప్రతి నెల 6,300 కోట్లు చెల్లిస్తుందని, ఇంత ఆర్థిక భారాన్ని మోస్త ఇంత ఆర్థిక భారాన్ని మోస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం అమలుకై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతుందని అన్నారు. 2023 డిసెంబర్ తర్వాత నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న,చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలలో విశ్వాసం కలిగి ఉండటంతోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని, మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికల్లోను 80% పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం అని రాబోయే ఎన్నికలకు సెమీఫైనల్స్ అని నోరు జారి తర్వాత తమాహించుకున్నాయన్నారు. ఇప్పటికీ ఫోన్ టాపింగ్ జరుగుతుందని బాధ్యులపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను ప్రభుత్వ ఉద్యోగులను ఓటు అడగడంలో తప్పేమీ ఉందని దానిని టిఆర్ఎస్ జీర్ణించుకోలేక హర్దార్హితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యకరమైన మాటలతో విమర్శలు చేయటం, వారి దిగజారుడుతనాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, రైతులకు సన్నవడ్లకు క్వింటాకు 500 మద్దతు ధర కల్పించడం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని పొంగులేటి అన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు స్వర్ణకుమారి, నిరంజన్ రెడ్డి, లింగాల రవికుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.