Take a fresh look at your lifestyle.

12 న జరిగే కార్మిక బంద్ జయప్రదం చేయండి

 

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు , రవాణా రంగాలలో పనిచేయుచున్న కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు . మంగళవారం కోదాడ , బాలాజీనగర్ లోని ఎస్ డబ్ల్యూ సి గోదాములో పని చేస్తున్న హమాలీలతో కలిసి గోదాం మేనేజర్ సంపత్ కుమార్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాడని , సాధించుకున్న హక్కులను తీసివేస్తూ పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తున్న మోదీని , బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు . దేశంలో 60 కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న కార్మికులు , ప్రైవేటు రంగాలు పనిచేస్తున్న కార్మికులు విధిగా సమ్మెలో పాల్గొనాలని ఆటో , ఆర్టీసీ , బ్యాంకింగ్ , ఎల్ఐసి , ఇండస్ట్రియల్ , ఆశకార్యకర్తలు , అంగన్వాడి సిబ్బంది , ఏఎన్ఎంలు సమ్మె లో పాల్గొంటున్నారని అలాగే గ్రామీణ కార్మిక సోదరులు , రైతు సోదరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు కంపాటి నాగయ్య , బి. సైదా , టి శ్రీను , పాలిక మహేష్ , జగ్గాని వెంకన్న , సైదులు , ఉప్పల రమేష్ , ఈదుల వెంకన్న , మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.