Take a fresh look at your lifestyle.

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై అన్నదాతల ఆందోళన…

వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్…
ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి…
పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

వరి ధాన్యం కొనుగోల్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల జిల్లా పూడూర్ చౌరస్తాలో అన్నదాతల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా వల్ల జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై ఇరువైపుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి రైతులతో ధర్నాలో పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు పోలీసులు వచ్చి రైతులతో పాటు జీవన్ రెడ్డి ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, రైతులకు మధ్య తోపు లాట జరిగింది. చివరకు వారిని అక్కడినుంచి తరలించి ధర్నా విరమింప జేశారు. ఈ సందర్భంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, ఫోర్తు సిటీ ఎక్కడ పోదని ముందు మీ వైఖరి మార్చుకోని రైతుల సమస్యలపైన దృష్టి సాధించాలని సూచించారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.