కోరుట్ల, ముద్ర: కోరుట్ల పట్టణంలో డక్కలి కుల సంక్షేమ సంఘ భవన ప్రారంభం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసారు. ఈ సందర్భంగా సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల అభిజ్ఞత కోసం పాటుపడే ప్రభుత్వమని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లోకి నిర్భయంగా వెళ్తున్నామని అన్నారు.అంతే కాకుండా ప్రతి కుల సంఘ భవనానికి నిధులు మంజూరు చేస్తూ అసంపూర్తిగా ఉన్న భవనాలను నిధుల మంజూరు ద్వారా పూర్తి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్, ఎంబెరి నాగభూషణం, ఆడేపు మధు, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, దక్కలి కుల సంఘ నాయకులు రాజమొగిళి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.