Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికన్నాలు కదాలాలి. బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

  • గని కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడిన తోలి సిఎం కేసీఆర్‌.
  • రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: తోలి సిఎం కేసీఆర్‌ అనాడు సాగించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సింగరేణి కార్మికులదే ప్రధాన భూమిక.10 ఎళ్ల కేసీఆర్‌పాలనలో కార్మికన్నాలను కడుపులో పెట్టుకుని కాపాడారు.కారుణ్య నియామాలు ఇచ్చి కార్మికన్నాల వారసుల జీవితాల్లో వెలుగులు నింపారని 27 వ తేదిన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికన్నాలు పాల్గొని కేసీఆర్‌ కి మద్దతుగా నిలువాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.శనివారం ఆర్జీ వన్ పరిధిలోని 11 ఏ గని వద్ద కార్మికులతో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ కి మద్దతూగా సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మే చరిత్ర లో నిలిచిపోతుందన్నారు.నాడు జాతీయ పార్టీ లు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్‌ కారుణ్యనియామాకాల ద్వారా తిరిగి సింగరేణి సంస్థ లో ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. 25 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్‌ అనేక విషయాలు మాట్లాడానున్నరన్నారు.తాము ఎమ్మెల్యే 5 సంవత్సరాల కాలంగా సింగరేణి కార్మికులకు అండగా నిలిచామని వారికి ఏ కష్టంవచ్చిన టిబిజికెఎస్ బిఆర్ ఎస్ పార్టీ మద్దతుగా ఉన్నామని చెప్పారు.కనివిని ఎరుగని రితిలో పండగ వాతావరణం లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కార్మకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టి.బి.జి.కె.ఎస్ నాయకులు రామమూర్తి,కోమురయ్య, వడ్డెపల్లి శంకర్ పర్లపల్లి రవి బి.ఆర్.ఎస్ నాయకులు కౌశిక హరి,గోపు అయులయ్య యాదవ్ నారాయణదాసు మారుతి జోసెఫ్ ఆవునూరి వెంకటేష్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.