Take a fresh look at your lifestyle.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువుల అభివృద్ధే లక్ష్యం

  • పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ.

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న సుమారు 64 చేరువులను దాతల సహకారంలో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని పీయేసీ ఛైర్మన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.నెక్సాస్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ, ఐటియుఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ల సీఎస్సార్ నిధులతో మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, గుర్నాథమ్ మక్తా మహబూబ్ పెట్ లోని పెద్దకుడి చెరువు సుందరీకరణ పనులను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరికరణ తో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని, చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని, జీవ వైవిధ్యం పెరుగుతుంది, పక్షుల వలసలు మొదలు అవుతాయని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే వారు కనబడే దేవుళ్ళతో సమానమని చైర్మన్ గాంధీ తెలియచేశారు.త్వరలోనే మియపూర్ చెరువుల రూపురేఖలతో పాటు దశ-దిశ మారుతాయని, పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్చమైన ఆహ్లదకరమైన వాతావరణం అందించడమే నా లక్ష్యం అని చైర్మన్ గాంధీ తెలియచేశారు. చెరువు పునరుద్ధరణ కార్యక్రమం ప్రభుత్వం, పరిశ్రమల మరియు సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నెక్సాస్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ, ఐటియుఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ల సీఎస్సార్ నిధులతో మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరికరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం, సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయ అని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినదిస్తున్నానని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు.పునరుద్ధరణపాటు మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.