Take a fresh look at your lifestyle.

పేదల కన్నీటిని తీర్చేందుకే భూ భారతి

  • పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం.
  • అబాదీ ఇళ్ల‌కు కూడా డాక్యుమెంట్లు.
  • త్వ‌ర‌లో భూభార‌తి టోల్‌ఫ్రీ నెంబ‌ర్.
  • గిరిజ‌న ప్రాంత స‌మ‌స్య‌ల‌పై ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు.
  • ములుగు జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టును  ప్రారంభించిన మంత్రి  పొంగులేటి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: పేదల కన్నీటిని తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని  రాష్ట్ర  రెవెన్యూ, హౌసింగ్,  సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  స్పష్టం చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా  పార్ట్-బి లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయన్నారు. ఈ భూములకు  భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామన్నారు.శుక్రవారం ములుగు జిల్లా  వెంకటాపూర్ లో మంత్రులు కొండ సురేఖ,  సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.త‌ర్వాత  ఆదిలాబాద్  జిల్లా భోర‌జ్ మండ‌లం పుసాయ్ గ్రామంలో  భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో  ఆయన  పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని మంత్రి పేర్కొన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే  తమ లక్ష్యంగా పనిచేస్తామన్నారు.ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తామన్నారు.రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ ..రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారన్నారు. ఇక ఇప్పుడు ఆ అవసరం రైతులకు లేదన్నారు.అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.ధరణిపై గత పాలకులు ఏనాడు కూడా రెవెన్యూ సదస్సు పెట్టలేదని ఒకవేళ రెవెన్యూ సదస్సులు పెట్టి ఉంటే ఆనాడే ఆ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడేవారు. గత బిఆర్ఎస్ పాలకులు చేసిన తప్పులను ఇప్పటికీ గ్రహించడం లేదని వారికి జ్ఞానోదయం కావడం లేదన్నారు. గ‌తంలో గులాబీ ద‌ళం కోసం కేసీఆర్ 2020- ధ‌ర‌ణి చ‌ట్టాన్ని తీసుకువ‌స్తే మేం దానిని బంగాళాఖాతంలోకి విసిరేసి సామాన్య ప్ర‌జ‌ల కోసం 2025- భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామన్నారు.రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు డాక్యుమెంట్లు లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాస‌గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నామన్నారుధ‌ర‌ణి ద‌ళారులు, గులాబీ పార్టీ గులాములు ఇచ్చే డ‌బ్బుతో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడితే  ప్రజలు ఊరుకోరన్నారు.భూ భార‌తి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గాను త‌మ కార్యాల‌యం, సిసిఎల్ఎ కార్యాల‌యంను అనుసంధానించే టోల్‌ఫ్రీ నెంబ‌రును త్వ‌ర‌లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామన్నారు. గిరిజ‌న‌, గిరిజ‌నేతరులు ఉండే ప్రాంతంలో భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త‌ ప‌రిష్కారానికి  కేంద్ర‌ప్ర‌భుత్వ నిబంధ‌న‌లకు లోబ‌డి  ఒక క‌మిటీని నియ‌మిస్తామని మంత్రి పొంగులేటి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.