Take a fresh look at your lifestyle.

కుక్కల దాడిలో పది మేక పిల్లల మృతి

 

ముద్ర. నడిగూడెం…..
వీధి కుక్కల దాడిలో మేకపిల్లలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కోడిపుంజుల గూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తీగల శ్రీనుకు చెందిన మేకల మందపై వీధి కుక్కలు గుంపుగా ఒక్కసారి పాకలోకి చొరబడి దాడి చేయడంతో 10 మేకపిల్లలు అక్కడికక్కడే మృతి చెందడంతో బాధితుడు కన్నీటి పర్యంతమైనాడు. సుమారు 40 వేల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.

Leave A Reply

Your email address will not be published.