కాంగ్రెస్ ప్రజా పాలనలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు
చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉద్రిక్తత.
సహకార సంఘానికి తాళం వేసిన రైతులు….
పురుగుల మందు డబ్బా తో రైతుల ధర్నా

చిలుకూరు, ముద్ర:
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను రద్దు చేయాలని
చిలుకూరు మండల కేంద్రంలో ఉన్న సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ
పెద్ద సెల్ (టచ్ సెల్ ) ఉన్న రైతులే యాప్ ద్వారా యూరియా ఆన్లైన్ చేసుకుంటున్నారని కీ ప్యాడ్ సెల్ ఫోన్లు ఉన్న రైతుల పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు,వెంటనే ఆన్లైన్ యాప్ రద్దుచేయాలని రైతులు డిమాండ్ చేశారు,యాప్ రద్దు చేయకపోతే యూరియా అందక రైతులకు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.