ముద్ర, గద్వాల:
కేటిదొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడు శివారులో అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక టిప్పర్‌ను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం నుండి ఇర్కిచేడు గ్రామానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇర్కిచేడు గ్రామ శివారులో తనిఖీలు చేపట్టగా, ఇసుక రవాణకు అనుతులు లేకపోవడంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రబండకు చెందిన, చంద్రుడుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.