ముద్ర మల్కాజిగిరి;
మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను.
గ్రామాభివృద్ధి కోసం, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అడుగులు వేయాలి.ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలన్నారు.
అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడిచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్ పాల్గొన్నారు.