పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ చామల ,ఎమ్మెల్యే మందుల సామెల్.
మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కొండగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూర్ గాంధీ నగర్ ఏడో వార్డు బీసీ హాస్టల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందిని ఓటింగ్ సరళని అడిగి తెలుసుకున్నారు. కొండాపురం లోని 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఓటింగ్ సరళని అడిగి తెలుసుకున్నారు.

మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు.
మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల లో భాగంగా 8 వ వార్డు కు సంబంధించి స్థానిక అంగడి బజార్ లోని మండల ప్రాథమిక పాఠశాలలో 17 ,18 వ పోలింగ్ బూతు ల వద్ద మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు .ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఎంతో సంతోషించి తమ ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం ఆకర్షణీయంగా తీర్చేదిద్దిన మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో తమ స్టేటస్ గా పెట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న వంద సంవత్సరాల వృద్ధురాలు.
-ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పది… బీసు రంగమ్మ.
మోత్కూర్ ముద్ర న్యూస్; మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 9వ వార్డు పరిధిలోని కొండాపురం గ్రామంలోని 20వ పోలింగ్ బూత్ లో జామ చెట్ల బావి గ్రామానికి చెందిన బిసు రంగమ్మ (100) సంవత్సరాలు తమ ఓటు హక్కును వినియోగించు కున్నా రు.ఎన్నికల సిబ్బంది ఏర్పాటుచేసిన వీల్ చైర్ లో వృద్ధురాలని వాలంటీర్స్ పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు వేయించారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నుని బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు రంగమ్మ ను అధికారులు పోలీస్ మరియు ఎన్నికల సిబ్బంది సైతం ఆమెతో కలిసి ఫోటోలు దిగి తమ సంతోషం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని ఈ వయసులో తాను ఓటు వేయడం ఆనందంగా ఉన్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
