- మెదక్ లో రాష్ట్ర మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
ముద్ర ప్రతినిధి, మెదక్: 60 వేల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని బీఅర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లకు తీసుకెళ్లడంతో ఖజానా మొత్తం ఖాళీ అయిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో ఇందిరా శక్తి సంబురాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. మంత్రితోపాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే అప్పులే ఉన్నాయన్నారు..ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించినా..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టిందన్నారు.ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మేలు చేయాలనే గరీబి హటావో స్కీం తీసుకొచ్చిందన్నారు.కేంద్రం నుంచి మాట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు.మన రాష్ట్రం నుంచి కేంద్రానికి బాగానే టాక్స్ కడుతున్నామని తెలిపారు.మెదక్ ఎంపీ రఘునందరావ్ మోడీకి సన్నిహితుడు కాబట్టి ఏది అడిగినా కాదనడన్నారు.వడ్డీ లేని రుణాలు మహిళలకే వెళ్లినప్పుడు కుటుంబం బాగుపడుతుంది. తదనంతరం రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదన్నారు.ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… మహిళలు శక్తి స్వరూపులు, ప్రభుత్వ రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు లబ్ధిదారులు పెరుగుతున్నందున కొత్త రేషన్ దుకాణాలు మంజూరు చేసి ఆడబిడ్డలకు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యం,, ప్రజాపాలనలో మహిళల అభివృడ్డికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కష్టాలు తీర్చి సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ.. మహిళలకు అభివృద్ధికి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాద బీమా, సన్న బియ్యం ఇవ్వడంతో నాణ్యమైన బియ్యం భోజనం చేస్తున్నారన్నారు. జిల్లాల గుప్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
- మహిళలు డ్రైవింగ్ నేర్చుకోండి కారు ఇప్పిస్తా: ఎమ్మెల్సీ అంజిరెడ్డి
మహిళలు కారు డ్రైవింగ్ నేర్చుకోండి..మెదక్ నియోజకవర్గానికి కారు ఇప్పిస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి ప్రకటించారు. మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మెంట్ నగేష్ టిఆర్డిఓ శ్రీనివాసరావు ఎపిడి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను, కొత్త రేషన్ కార్డు పత్రాలను మంత్రి వివేక్ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు మొక్కలు నాటారు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు.
