Take a fresh look at your lifestyle.

సిద్దిపేట సురభి కళాశాల లో ఉరి వేసుకొని వైద్య విద్యార్ధిని మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల సురభి హాస్పిటల్    జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని సురభి మెడికల్ కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందిన శ్రీజ (20) సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ పరిధిలోని సురభి మెడికల్ కళాశాలలో ఫిజియోతెరపి మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించడంతో సహ విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు మేనమామ మాత్రం పై చదువుల కొరకు సురభి మెడికల్ కాలేజీలో చేర్పించినట్లు తెలిపారు. వస్తుందన్న తరుణంలో మా బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం దీనికి పూర్తి బాధ్యత సురభి మెడికల్ కాలేజీ వారిదే అని వారు ఆరోపించారు కుటుంబ సభ్యులకు సమాచారంఇచ్చారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలా? లేక చదువుల ఒత్తిడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తుకొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.