ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తిమాజీపేట మండలంలోని ప్యాక్స్ (PACS) వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన ధరలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇలాంటి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మరింత మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవ్, వెంకట్ రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, హర్ష వర్ధన్ రెడ్డి, ముబ్బరక్, రవీందర్ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.