Take a fresh look at your lifestyle.

తేదీ 15న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పురుషులకు వ్యాసెక్టమీ శిబిరం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 15న బుధవారం ఉదయం 10 గంటలకు గది నెంబర్ 22లోని పి.పి. యూనిట్‌లో పురుషులకు కోతకుట్టులేని ఎన్‌ఎస్‌వీ (No Scalpel Vasectomy) పద్ధతిలో వ్యాసెక్టమీ ఆపరేషన్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలిపారు.

సంతానం కలిగిన అర్హులైన దంపతులలో పురుషులకు శాశ్వత కుటుంబ నియంత్రణ కోసం ఈ ఆపరేషన్‌ను సుశిక్షితులైన వైద్యులు నిర్వహిస్తారని తెలిపారు. ముందుగా సాధారణ మరియు రక్త పరీక్షలు చేసి, అనంతరం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ పూర్తిచేసి, మందులు ఇచ్చి వెంటనే డిశ్చార్జ్ చేయనున్నట్లు వివరించారు.

ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునే వారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తక జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. సందేహాలు, వివరాల కోసం ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ఇన్‌చార్జ్ టి. యాదగిరిని నేరుగా లేదా సెల్ నెంబర్లు 9014932408, 9989221518లో సంప్రదించాలని కోరారు.

ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సాహకంగా ప్రతి ఒక్కరికి రూ.1000 నగదు అందజేయనున్నట్లు నాగర్ కర్నూల్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.