Take a fresh look at your lifestyle.

నారి శక్తి వందన్ అభినందనీయం

 

కోరుట్ల, ముద్ర;
నారి శక్తి వందన్ కార్యక్రమం అభినందనీయం అని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగ చైర్ పర్సన్ డా వై స్వీతీ అనూప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం కల్పిస్తూ, భారతదేశంలో లింగ సమానత్వానికి కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ సంస్కరణ ద్వారా మహిళలకు నిర్ణయాధికార వేదికల్లో సముచిత స్థానం లభించి, పాలన మరింత సమగ్రంగా, సమతుల్యంగా మారుతుందన్నారు.

మహిళా నాయకత్వం ఆరోగ్యం, విద్య, భద్రత, ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రభావం చూపుతూ, సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తుంది. ఇది కేవలం విధాన మార్పు మాత్రమే కాకుండా, సమానత్వం మరియు సమగ్ర అభివృద్ధి వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక పరివర్తన అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.