Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. -వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి.

 

ముద్ర. పరకాల.

పరకాల పట్టణం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 10 11 12 వార్డులలో ఆయన వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గత పాలకవర్గం పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో పరకాల పట్టణంలోని 22 వార్డులను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటారన్న విశ్వాసాన్ని చైర్మన్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరుగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుందని ఆ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజిరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే పరకాల పట్టణం రూపురేఖలను మార్చడంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారన్నారు. తన ఆస్తులు పెంచుకోవడంలో భాగంగా రోడ్లు చేశారు కానీ పట్టణంలోని పరిస్థితులను మార్చలేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.