Take a fresh look at your lifestyle.

రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనది..

 

నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప సేవా ధర్మం..

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనదని, నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప సేవా ధర్మమని శుశ్రుత హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. మురళీకృష్ణ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శుశ్రుత ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగి బాధను తమ బాధగా భావిస్తూ రాత్రింబవళ్లు సేవలందించే నర్సులు నిజమైన సేవామూర్తులని కొనియాడారు. వైద్యులు సూచించిన చికిత్సను సమర్థంగా అమలు చేయడమే కాకుండా, రోగులకు ధైర్యం చెప్పి మానసిక బలాన్ని అందించడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోహిత్ సాయి, రిచ్ చిల్డ్రన్స్, స్వేచ్ఛ, శ్వాస, అవిశాయి, మంజునాథ సాయిరాం ఆసుపత్రుల ప్రతినిధులతో పాటు, డా. శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్యాగ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ నరేందర్, అనుజ్ఞ, నవ్య, సాయి చరణి, స్పందన, లెనివియా, ఇమాన్యువల్, స్వామి, అజయ్, శ్రవణ్, హమ్మద్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.