Take a fresh look at your lifestyle.

జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. దేశ ఉప ప్రధానిగా సేవలందించిన వారి సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. వివక్ష రహిత సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పని చేసారని పేర్కొన్నారు.ఆయన కార్యాచరణ నేటికీ ఆదర్శనీయమని, అంటరానితనం అనే దురాచారం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసిననాడే బాబు జగ్జీవన్ రామ్‌కి ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు.ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు శరత్ రెడ్డి, సత్యం, రమేష్ నాయక్, మధుమోహన్, సీనియర్ నాయకులు నరేష్, సిద్ధిక్, అనంత రెడ్డి, ప్రభాకర్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
………………………

Leave A Reply

Your email address will not be published.