ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….. బాబు జగ్జీవన్ రామ్ చిరస్మరణీయుడని ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఆయన జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకుందామన్నారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను అందరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. తన జీవితమంతా దేశ సేవకు అంకితం చేసి, నవభారత నిర్మాణంలో నాలుగు దశాబ్దాలు కృషి చేసిన బాబు జగ్జీవన్ రాం జీవితం చిరస్మరణీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా , జిల్లా ఎస్పీ శ డి.జానకి , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహర్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, కార్పొరేటర్లు సిబి శ్రీపూజిత, ప్రవీణ్ కుమార్, గులాం జహీర్, తాహేర్,అవేజ్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.