Take a fresh look at your lifestyle.

బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్‌ పట్టణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 36వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, రాజమణి, మాయ గంగమణి, ఆలయ అధ్యక్షుడు కంచి మధుసూదన్, కమిటీ సభ్యులు నాగరాజు, కాశీనాథ్, నాయకులు దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.