కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపిన విరాహత్ అలీ
ముద్ర, కుషాయిగూడ:
ప్రెస్ క్లబ్ లు జర్నలిస్ట్ ల సంక్షేమంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ సూచించారు. నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా కమిటీ ప్రతినిధులు సోమవారం టీయూడబ్ల్యూజె అధ్యక్షుడు విరాహత్అలీ, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి లను మార్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కాప్రా ప్రెస్ క్లబ్ కొత్త అధ్యక్షుడు జ్యోతిర్మయా చారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి సురేష్ లను విరాహత్ అలీ శాలువాతో సన్మానించి నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు రిపోర్టర్ల చేష్టల వల్ల సమాజంలో పాత్రికేయ విలువలు రోజు రోజుకి దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ క్లబ్ లు బాధ్యతాయుతంగా ఉంటూ పాత్రికేయ విలువలు కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే పాత్రికేయుల సంక్షేమం తో పాటు సమాజ సేవలో కూడా ప్రెస్ క్లబ్ లు ముందుండాలని కోరారు. ఇందుకు సంబందించిన సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కాప్రా ప్రెస్ క్లబ్ కొత్త కమిటీ కి సూచించారు.ఈ కార్యక్రమం లోకాప్రా ప్రెస్ క్లబ్ కమిటీ ప్రతినిధులు,సీనియర్ జర్నలిస్ట్ లు చంద్రమౌళి, సహదేవ చారి,ఆంధ్రప్రభ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్,చంద్ర మోహన్ కడియాల రమేష్, శ్రీనివాస్,శంకర్,బాల్ రెడ్డి, నర్సింగ్ గౌడ్,పవన్,బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.