ముద్ర, నారాయణపేట :
పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఓ మధురానుభూతి… వీడ్కోలు సమావేశం పదేళ్ల తమ బాల్య దశలో మరచిపోలేని మధుర ఘట్టం. ఇలాంటి మధురానుభూతిలో ఒకటైన స్వపరిపాలన దినోత్సవాన్ని పట్టణంలోని శ్రీ హంసవాహిని స్కూల్ లో విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. కలెక్టర్ గా నందిని, డీఈవోగా నవిత, ఎంఈఓ గా అరవింద్, ప్రిన్సిపల్ గా ఎల్లప్ప, వైస్ ప్రిన్సిపాల్ గా శిరీషలు వ్యవహరించారు. అదేవిధంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయ పాత్ర పోషించి చక్కగా విద్యాబోధన చేశారు. పాఠశాల కరస్పాండెంట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ఒక్కరోజు ఉపాధ్యాయ పాత్రలో వారి అనుభవాలను వివరించారు. అనంతరం చక్కటి విద్యాబోధన చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేష్, ఉపాధ్యాయులు నమ్రత, విజయ, అమల, షమీనా, సౌజన్య పాల్గొన్నారు.
