Take a fresh look at your lifestyle.

టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వచ్చేనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలని జిల్లా విద్యా శాఖాధికారి దర్శనం భోజన్న కోరారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో పాటు సిఎస్, డివో లకు సెల్ ఫోన్ అనుమతి లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా గుర్తింపు కార్డు ధరించాలని సూచించారు. అనధికార వ్యక్తులను అనుమతించ కూడదని అన్నారు. పరీక్ష పత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరిచినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అన్నారు. వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్ష గదిని కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్, జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.