కరీంనగర్ జిల్లా:
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు రూ.11358.47 కోట్ల రుణాలు మంజూరు
జిల్లాకేంద్రంలోని KDCCB సమావేశం మందిరంలో బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతి పై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 84.55% రుణాలను పంపిణీ చేసినందుకు బ్యాంకర్లందరినీ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 2025 నెల వరకు రూ. 11358.47 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ. 4665.81 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 2329.25 కోట్లు, విద్యా రుణాలకు రూ. 14.52 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ. 161.52 కోట్లు, SHG group loans రూ.918.38 కోట్లు మరియు ఇతర రంగాలకు సంబంధించి రూ.3268.99 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లు త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాలలో రుణాలు మంజూరి అయిన లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించేలా ఆయా శాఖల అధికారులు జిల్లాలో రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు.
జిల్లాలో ప్రధానమంత్రి స్వానిది కింద మొదటి, రెండవ, మూడవసారి రుణం దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ దరఖాస్తులను మరియు PMEGP, PM Viswakarama Yojana scheme అప్లికేషన్ లను సత్వరం పరిష్కరించాలని బ్యాంకర్లకి సూచించారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారంగా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లో భాగంగా
09.02. 2026 నుండి 13.02.2026 వరకు “KYC – సురక్షిత బ్యాంకింగ్ కు మీ తొలి అడుగు” నినాదముతో కరీంనగర్ జిల్లాలో సభలను నిర్వహించి బ్యాంకులు అవగాహన సదస్సులు నిర్వహించారని తెలియజేశారు. వినియోగదారులు తమ ఖాతాలను తాజా పత్రాలతో నవీకరించాలి అని తెలియచేసారు.
కలెక్టర్ మాట్లాడుతూ క్లైమ్ చేయని ఆర్థిక ఆస్తులకు హక్కుదారులు అవసరమైన పత్రాలతో తమ బ్యాంకులను మరియు ఇతర సంస్థలను సంప్రదించి నిధులను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు తమ యొక్క అన్ క్లైమేడ్ డిపాజిట్ వివరాలను తెలుసుకోవటానికి గూగుల్లో UDGAM పోర్టల్ లో మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీ వివరాలతో మీయొక్క ఎకౌంటు ఉన్నదో లేదో కూడా చూసుకోవచ్చు అని తెలియచేసారు.
కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పాత ఖాతాలో మరిచిపోయిన అమౌంట్లను తిరిగి తీసుకోవచ్చని సూచించారు.
జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఇతర పొదుపు బ్యాంకు ఖాతాలు కలిగిన వారు వారి ఖాతాలని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు బ్యాంకు వాళ్ళకు యిచ్చి రి కే వై సి చేసుకోవాలని సూచించారు.
ఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులందరూ తాము బ్యాంకర్ల నుండి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార అభివృద్ధికై ఉపయోగించాలని మరియు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎల్డిఎం ఆంజనేయులు, ఆర్బఐ LDO Yaswanth , ddm S. Jaye prakash from నాబార్డ్ , ఎస్బిఐ agm venkatesh, యుబిఐ AGM, టీజీబీ Rm బాల నాగు, కెడీసీసీబీ CEO Satyanarayana , అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, coordinators కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్స్, డిఎఓ , జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎమ్ , డిడబ్ల్యూఓ సరస్వతి, అడిషనల్ డిఆర్డిఏ సునీత, DRDO, PD MEPMA, తదితరులు పాల్గొన్నారు.