- పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశా.
- జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
- మీడియాతో కాంగ్రెస్ నేత అజారుద్దీన్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు అజారుద్దీన్ ప్రకటించారు.ఆ స్ధానం నుంచి తానే బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ వచ్చిందన్న ఆయన ఆఖరి వరకు పోరాడి.. తక్కువ ఓట్లతో ఓడిపోయానని చెప్పారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తను పని చేశానన్నారు. అయితే పార్టీలో ఉన్న కొంత మంది వ్యక్తులు కావాలని తనపై కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియా, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని వాపోయారు. తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారనీ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లాంటి పెద్దల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని..గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తామని చెప్పారు. కాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.