Take a fresh look at your lifestyle.

ఘనంగా డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు

 

ముద్ర, తాండూర్:  

తాండూరు నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవుడు, స్నేహ గుణశీలి, అనునిత్యం ఆపదలో ఉన్న నిరుపేదలకు, వైద్యపరంగా, నేనున్నాననే భరోసా కల్పించి, ఆదుకునే నాయకుడే డాక్టర్ సంపత్ కుమార్. పట్టణ ప్రజలే కాకుండా, నియోజకవర్గ ప్రజలకు సైతం కష్టకాలంలో చేయూతనందిస్తున్నాడు. నిరుపేద వ్యక్తులు చనిపోతే వారి అంత్యక్రియలకు 5000 రూపాయలు సహాయం అందిస్తారు. వైద్య పరంగా సైతం వందలాది మందికి రక్తదానం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడిన మహానుభావుడు. ఇంతటి సహాయ సహకారాలు అందించే మహా నాయకుని జన్మదిన వేడుకలు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో నూతన కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రమోదిని, పంజుగుల శ్రీశైల్ రెడ్డి, నరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప, కౌన్సిలర్లు ఇర్షాద్, జావిద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.