హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 16:
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ 3వ రోడ్డులోని శ్రీ ఏకాంబరేశ్వర శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన కమిషనర్‌కు ఆలయ చైర్మన్ పి.వి. శ్రీరమణ మరియు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివరాత్రి వేళ భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట కూకట్‌పల్లి ఏసీపీ (ACP), కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌ఓ (SHO) తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.