Take a fresh look at your lifestyle.

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

దివ్యాంగుల అభ్యున్న‌తి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. కేర‌ళ‌కు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన స‌భ్యుల‌తో ఆయన శ‌నివారం ప్ర‌జాభ‌వ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దివ్యాంగులు కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని వారి అభ్యున్న‌తికి ప్రభుత్వాలు కృషి చేయాల‌ని అన్నారు. వైక‌ల్యం దుర‌ద్రుష్ట‌క‌రమే అయినా.. వారిని స‌మాజంలో అంద‌రితో సమానంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి ప‌నిచేయాల‌న్నారు. కేర‌ళ‌లో కూడా వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేనన్న భట్టి… ఆ ప్ర‌భుత్వంలో అన్నివ‌ర్గాల‌తో స‌మానంగా దివ్యాంగుల‌కు అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.